ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CS Sameer Sharma On PRC: పీఆర్‌సీపై 3 రోజుల్లోగా సీఎం జగన్‌ నిర్ణయం: సీఎస్‌ సమీర్‌శర్మ - ఏపీ సీఎస్ సమీర్ శర్మ

CS Sameer Sharma On PRC:
CS Sameer Sharma On PRC:

By

Published : Dec 13, 2021, 6:57 PM IST

Updated : Dec 13, 2021, 9:54 PM IST

18:51 December 13

పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతాం: సీఎస్‌ సమీర్‌శర్మ

సీఎస్‌ సమీర్‌శర్మ

CS Sameer Sharma On PRC: పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించామని సీఎస్‌ సమీర్ శర్మ వెల్లడించారు. పీఆర్‌సీపై ముఖ్యమంత్రి మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామన్న సీఎస్‌.. ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని చెప్పారు. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. పీఆర్‌సీ అమలుతో రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు.

'పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించాం. పీఆర్‌సీపై సీఎం జగన్‌ 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చాం. పీఆర్‌సీ అమలుతో రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల అదనపు భారం పడనుంది'- సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికీ ఫిట్‌మెంట్ సిఫారసు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. అధికారులు, నిపుణులతో చర్చించాకే ఫిట్‌మెంట్‌పై సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు. పెండింగ్ డీఏలపై ఆర్థికశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విభజన పెను ప్రభావం చూపింది. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ. 1,70,215గా ఉంది. రూ. 6,284 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ఉన్న రూ. 18,969.26 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. రూ.20 వేల కోట్ల అదనపు భారం పడింది. ఇంతటి కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. జులై 1, 2019 నుంచి 27 శాతం ఐఆర్‌ను ఇచ్చింది. ఐఆర్‌ రూపంలో ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ.4,569.78 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులతో కలిపి మొత్తంగా 3,01,021 మంది ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లుకు పెరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ విభాగాలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు తదితర ఉద్యోగులకూ వర్తింపజేసింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా వీరికి అమలు చేస్తోంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 360 కోట్ల మేర ఏడాదికి అదనపు భారం పడుతోంది’ - సీఎస్‌ సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

14.29 శాతం ఫిట్‌మెంట్​కు సిఫార్సు
ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ సిఫారసు చేసినట్లు సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ పేర్కొంది. 11వ వేతన సంఘం సిఫారసులపై నివేదిక ఇచ్చిన కమిటీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పలు అంశాలను నివేదికలో ప్రస్తావించింది. ఉద్యోగుల లబ్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెల్లడించింది. 2018–19లో జీతాలు, పింఛన్లకు రూ.52,513 కోట్లు ఖర్చు కాగా.. 2020–21కి జీతాలు, పింఛన్ల వ్యయం రూ.67,340 కోట్లకు చేరిందని తెలిపింది. 2018-19లో ఎస్‌ఓఆర్‌లో జీతాలు, పింఛన్లు 84 శాతం కాగా... 2020–21కి ఎస్‌ఓఆర్‌లో జీతాలు, పింఛన్లు 111 శాతానికి చేరాయని వివరించింది. ప్రభుత్వ మొత్తం ఖర్చులో జీతాలు, పింఛన్ల వ్యయం ఏపీలోనే అధికమని స్పష్టం చేసింది. జీతాలు, పింఛన్ల ఖర్చు 2020–21 నాటికి 36 శాతానికి పెరిగిందన్న కమిటీ.. 2020–21లో తెలంగాణలో జీతాలు, పింఛన్ల ఖర్చు 21 శాతమేనని పేర్కొంది.

సీఎంకు పీఆర్సీ నివేదిక అందజేత

పీఆర్సీ నివేదికపై వివరాలు వెల్లడించే ముందు.. సీఎం జగన్​తో సీఎస్ సమీర్​ శర్మ, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌పై కార్యదర్శుల కమిటీ రూపొందించిన నివేదికను సీఎస్‌ సమీర్‌ శర్మ, కమిటీ సభ్యులు కలిసి సీఎం జగన్‌కు అందించారు. నివేదికను సీఎం జగన్‌ పరిశీలించిన అనంతరం సచివాలయంలో సీఎస్ మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి:

Venkatram Reddy On PRC: పీఆర్‌సీపై ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది: వెంకట్రామిరెడ్డి

Last Updated : Dec 13, 2021, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details