ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ నెల 28న పారిస్ వెళ్లనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం పారిస్ వెళ్లనున్నారు. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి వచ్చే నెల 2న కాన్వకేషన్ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
ఈ నెల 28న పారిస్‌కు సీఎం జగన్ - సీఎం జగన్ వార్తలు
ఈ నెల 28న సీఎం జగన్ పారిస్ వెళ్లనున్నారు. పారిస్‌లో చదువుతున్న కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు.
సీఎం జగన్