ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం: సీఎం జగన్ - స్పందనపై సీఎం జగన్ సమీక్ష

'స్పందన'పై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 15 నుంచి తొలి విడత ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో రికార్డు సృష్టించారంటూ కలెక్టర్లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

ap cm ys jagan
ap cm ys jagan

By

Published : Mar 16, 2021, 3:14 PM IST

రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తొలివిడతలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నామని తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని వెల్లడించారు. స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారం, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్షించారు. ఉపాధి హామీ పనుల్లో రికార్డు సృష్టించారని కలెక్టర్లకు సీఎం అభినందనలు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు దాదాపు రూ.6 వేల కోట్లు ఇవ్వగలిగామని చెప్పారు. యుద్ధప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. మే 2021 నాటికి అన్ని భవనాలూ పూర్తయ్యేలా చూడాలన్నారు.

ప్రీ ప్రైమరీ పాఠశాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్‌.. అంగన్వాడీలకు ఇవ్వనున్న శిక్షణపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని.. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details