ముఖ్యమంత్రి జగన్ ఇవాళ, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప బయల్దేరుతారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్ చేరుకుని... రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవార తన తండ్రి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా కుటుంబసమేతంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. ఘాట్ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్ పరీక్ష చేయించుకుని రావాలని ఆదేశించారు.
ఇవాళ కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ - వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప బయల్దేరుతారు.
cm-ys-jagan