రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, వైకాపా ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
'అణగారిన ప్రజల వికాసానికి అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిది. ఆయన అందించిన రాజ్యాంగం భారత్ ను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిపింది. మహోన్నత ఆశయాలు,స్ఫూర్తిదాయకమైన ఆలోచనల రూపంలో అంబేడ్కర్ ఎప్పటికీ బతికే ఉంటారు'.- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి