మంత్రిమండలి సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్తుండగా... మందడంలో రైతులు జైఅమరావతి అంటూ నినాదాలు చేశారు. మంత్రిమండలి సమావేశం నేపథ్యంలో మందడంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు బయటకు రాకుండా రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భారీ భద్రత నడుమ ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. రైతులు జైఅమరావతి అంటూ నినాదాలు చేశారు. ఏ ముఖ్యమంత్రి రైతులకు భయపడి ఇంత భద్రత మధ్య సచివాలయానికి వెళ్లలేదని చెప్పారు. తమకు న్యాయం జరిగే రోజు తొందరలోనే ఉందన్నారు.
సచివాలయానికి సీఎం.. మందడంలో భారీ భద్రత - CM Jagan to the Secretariat latest news
ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్తుండగా... మందడంలో రైతులు జైఅమరావతి అంటూ నినాదాలు చేశారు. రైతులు బయటకు రాకుండా పోలీసులు రెండంచెల భద్రతను పెట్టారు. తమకు న్యాయం జరిగే రోజు తొందరలోనే ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
సచివాలయానికి సీఎం.. మందడంలో భారీ భద్రత