80 శాతం మంది ప్రజలు తెదేపా వైపే:చంద్రబాబు - ప్రధాని మోదీ
పార్లమెంటులో ప్రధాని మాటలు దారుణంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు విమర్శించారు.రాష్ట్రానికి తగిలిన గాయంపై కారం చల్లుతున్నారని ఆరోపించారు.
టెలీకాన్ఫరెన్స్
అమరావతిలో సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ చేశారు. ప్రజాసేవలో అత్యుత్తమ పనితీరు సాధించామని వెల్లడించారు. 80 శాతం మంది ప్రజలు తెదేపాపై సంతృప్తిగా ఉన్నారన్నారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. పార్లమెంటులో ప్రధాని మాటలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రానికి తగిలిన గాయంపై కారం చల్లుతున్నారని ఆరోపించారు. మోదీ మోసాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభ సాక్షిగా గట్టిగా నిలదీశాడని కొనియాడారు.
Last Updated : Feb 8, 2019, 2:51 PM IST