ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 10, 2020, 5:50 PM IST

ETV Bharat / city

ప్లాస్మా దానానికి కరోనా విజేతలు ముందుకు రావాలి: ప్రవీణ్‌ ప్రకాష్‌

కరోనా చికిత్స విధానంలో ప్లాస్మాథెరపీ కీలకంగా మారుతుంది. మరణాల రేటు తగ్గించటంలో ఇది దోహడపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇదేస్ఫూర్తితో కరోనానుంచి కోలుకున్న సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్..ప్లాస్మా దానం చేశారు. వైరస్‌పై పోరాటంలో విజయం సాధించిన వారియర్స్‌.. ముందుకు రావాలని కోరారు.

secretary
secretary

ప్లాస్మా దానానికి కరోనా విజేతలు ముందుకు రావాలి:ప్రవీణ్‌ ప్రకాష్‌

కొవిడ్‌ కారణంగా..... తీవ్ర ఇబ్బందులు పడుతున్న కొందరు బాధితుల ప్రాణాలు కాపాడేందుకు తనవంతుగా ముందుకువచ్చారు..సీఎం ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌. కరోనా బారిన పడి కోలుకున్న ఆయన..విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మాదానం చేశారు. ప్లాస్మాదానం దానం చేసేవారు భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు. కరోనా వారియర్స్ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదనాం లాగే ప్లాస్మాను సైతం సులువుగా ఇవ్వవచ్చని తెలిపారు.

ప్లాస్మాదానం చేసినందుకు ప్రవీణ్ ప్రకాష్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. కరోనా నుంచి కోలుకున్న 2నెలలలోపు ప్లాస్మాదానం చేయవచ్చని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్‌ డా.శివశంకర్ తెలిపారు. మోడరేట్ స్టేజిలో చికిత్స పొందుతున్న వారికి, కరోనా తీవ్రస్థాయిలో ఉన్న రోగులకు ప్లాస్మాథెరపీ చికిత్స అందిస్తున్నామని...దీని ద్వారా మరణాల రేటు తగ్గుతుందని చెప్పారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోనే ఇప్పటివరకు ఆరుగురు బాధితులకు ప్లాస్మా థెరపీ చికిత్స అందిస్తే ఐదుగురు పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4లక్షల మందికి పైగా కరోనా బారి నుంచి కోలుకున్నారు. అయితే ప్లాస్మాదానం చేసిన వాళ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువ. ఇప్పటి వరకు 320 మంది మాత్రమే ప్రభుత్వాసుపత్రుల్లో ప్లాస్మాదానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details