ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన సంవత్సర మెుదట ప్రాజెక్టు ఆర్టీసీనే

క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీలో పూర్తి స్థాయి సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ 1 నుంచి పూర్తవుతుందని... దీర్ఘకాల కల నెరవేరుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.  జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నూతన సంవత్సరం నుంచి అమలు చేయనున్న పలు కార్యక్రమాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

cm spandana review meeting
నూతన సంవత్సర మెుదట ప్రాజెక్టు ఆర్టీసీనే

By

Published : Dec 31, 2019, 7:49 PM IST

నూతన సంవత్సర మెుదట ప్రాజెక్టు ఆర్టీసీనే
ఫిబ్రవరి నుంచి క్యాన్సర్​కు పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జనవరి 3 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి చివరి నాటికి 1.42 కోట్ల ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు.

వైఎస్ఆర్ నవ శకం సర్వే ద్వారా ఇళ్ల పట్టాలు, పింఛన్లు, రేషన్‌కార్డులకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువ వస్తున్నాయన్నారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఫిబ్రవరి ఒకటి నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా అర్హులైన వారి జాబితాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.

జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవుతున్నట్టు స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో తొలి కార్యక్రమం ఆర్టీసీదేననీ, 50వేల ఆర్టీసీ కుటుంబాల దీర్ఘకాల కల నెరవేర్చామన్నారు. ఆయా డిపోల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచించారు.

ఇదీ చదవండి: అమరావతిపై అంత కక్ష ఎందుకు?: పవన్‌కల్యాణ్‌

ABOUT THE AUTHOR

...view details