పదో తరగతి ప్రతిభావంతులకు ఏటా ఇచ్చే అబ్దుల్ కలాం పురస్కారాల పేరు మార్పుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అబ్దుల్ కలాం పేరిట ఉన్న పురస్కారాన్ని వైఎస్ఆర్ పేరిట అందించనున్నట్లు నిన్న జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. తనకు తెలియకుండా ప్రతిభా పురస్కారాల పేరు మార్చడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పురస్కారాలకు యథాతధంగా అబ్దుల్ కలాం పేరు పెట్టాలన్నారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, పూలే, జగజ్జీవన్రాం వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు. అంతకు ముందు తెదేపా అధినేత చంద్రబాబు... అబ్దుల్ కలాం పేరిట ఉన్న ప్రతిభ పురస్కారాల పేరు మార్చడంపై మండిపడ్డారు. ఈ చర్య ఎంతో విస్మయానికి గురిచేసిందన్నారు.
ప్రతిభా పురస్కారాలకు వైఎస్ పేరు పెట్టడంపై సీఎం ఆగ్రహం - ప్రతిభా పురస్కారాల పేరు మార్పు న్యూస్
ప్రతిభా పురస్కారాలకు కలాం పేరు మార్పుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై మండిపడ్డారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు. యథాతధంగా అబ్దుల్ కలాం పేరు పెట్టాలని అన్నారు.
cm