ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలి: సీఎం - undefined

విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖలో తీసుకురానున్న సంస్కరణలపై అధికారులతో చర్చించారు. పాఠశాలాల రూపురేఖలు మార్చేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు.

విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష

By

Published : Aug 10, 2019, 5:28 PM IST

Updated : Aug 10, 2019, 7:23 PM IST

విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో తీసుకురానున్న సంస్కరణలతో పాటు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులు, నిపుణుల కమిటీ నివేదికపై చర్చించారు.

సీఎం సమీక్షలో ప్రధానాంశాలు :

  1. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల మార్పుపై ప్రధాన చర్చ
  2. తొలివిడతలో 12,918 ప్రాథమిక, 3,832 ఉన్నత పాఠశాలల రూపురేఖలు మార్చాలని నిర్ణయం
  3. మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, రంగులు, ఫర్నిచర్ ఏర్పాటు
  4. తరగతి గదులకు మరమ్మతులు చేపట్టడం
  5. అవసరమున్న పాఠశాలలో అదనపు గదులు నిర్మాణం
  6. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులను నియమించాలని నిర్ణయం
  7. ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్‌ రూపొందించటం

సమీక్ష సందర్భంగా 42, 655 పాఠశాలల దృశ్యాలు, ఫోటోలను తీసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దాదాపు 10.88 లక్షల ఫోటోలను అప్​లోడ్ చేసినట్లు తెలిపారు. వీటిపై స్పందించిన సీఎం .. అన్ని సదుపాయాలు కల్పించాక మళ్లీ ఫోటోలు తీసి ప్రజల ముందుంచాలని అధికారులకు సూచించారు.

Last Updated : Aug 10, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details