గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 2 న గ్రామ, సచివాలయాల ప్రారంభ సన్నాహాలపై అధికారులతో చర్చించారు. 4 నెలల వ్యవధిలో 4 లక్షలకుపైగా నియామకాలు చేయగలిగామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. ఫిర్యాదుల కోసం 1902 కాల్ సెంటర్ సిద్ధం చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. డిసెంబరులో కొత్త పింఛన్లు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అధికారులకు అభినందనలు తెలిపిన సీఎం... ఎందుకంటే?
సచివాలయంలో ఉదయం నుంచి సీఎం జగన్ వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామ, సచివాలయాల ఉద్యోగాలపై సమీక్షించిన ఆయన... అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయ ఉద్యోగ భర్తీ ప్రక్రియ వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించి విజయవంతం చేసిన అధికారులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
సచివాలయాల ప్రారంభంపై సీఎం పలు సూచనలు
'ప్రజా సమస్యలపై స్పందనకు గ్రామ సచివాలయానికి ప్రత్యేక నంబర్ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్ ఉండాలి. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలి. రైతుభరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రకృతి, సేంద్రియ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. గ్రామసచివాలయాల ద్వారా దాదాపు 237 సర్వీసులు అందించాలి" - జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి