ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష - thadepally

రేషన్ పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల తో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు.

పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష

By

Published : Aug 27, 2019, 11:15 PM IST

పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష

సెప్టెంబర్1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎక్కడా లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటోంది. రేషన్ పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల తో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో బియ్యం సేకరణ ,ప్యాకింగ్ , పంపిణీ పై తీసుకున్న చర్యలను సీఎం కు అధికారులు వివరించారు. దశలవారీగా మిగిలిన జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినందున అందుకు తగ్గట్లుగా తినగలిగే బియ్యం సేకరణపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్ధితిపైనా...ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. తొలి త్రైమాసికంగా వచ్చిన రాబడి, ఖర్చు , వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details