ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనావాసాల్లోకి రెడ్, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలు రావొద్దు: సీఎం - కాలుష్యంపై అధికారులకు జగన్ ఆదేశాలు వార్తలు

రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై భారీ జరిమానాలు వేయడం సహా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని.. రియల్‌టైంలో డాటా స్వీకరణ, సహా స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు.

cm review on environment and polution act
cm review on environment and polution act

By

Published : May 20, 2020, 8:41 PM IST

ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ చట్టం చేయడంపై సీఎం జగన్‌ సమీక్షించారు. తీసుకురాబోతోన్న చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించి సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కంపెనీ విధిగా నిర్ణీత కాలానికి ఒకసారి స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి సూచనల అమలుపై నివేదిక ఇచ్చేలా చట్టంలో ప్రతిపాదించారు. ఈ నివేదికలను థర్డ్‌పార్టీ ఆడిటర్‌ చేత పర్యవేక్షణ, సమీక్ష చేయించాలని ప్రతిపాదన పెట్టారు. థర్డ్‌పార్టీ ఆడిటర్లుగా ప్రఖ్యాత, విశ్వసనీయ ఏజెన్సీలను ఎంపానెల్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎంపానెల్డ్‌ ఎన్విరాన్​ మెంటల్‌ ఏజెన్సీస్‌ ఇచ్చిన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీనలు చేసి వాటిపై చర్యలు తీసుకోవాలని.. ఈ నివేదికలను పబ్లిక్‌ డొమైన్‌లోకి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • ఎస్​ఓపీ తయారు చేయాలి

జనాభా ఉన్న ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జనావాస ప్రాంతాలకు నిర్ణీత దూరంలో ఉండాలన్నారు. కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ విధానాలతో ప్రభుత్వమే చేపడుతుందన్నారు. వ్యర్థాలు, కాలుష్య కారక పదార్థాలు, జలాలను పద్ధతి ప్రకారం నిర్వహించాలని లేకపోతే భవిష్యత్తు తరాలకు ఇబ్బంది వస్తుందన్నారు. కాలుష్య కారకాలు నిర్ణీత ప్రమాణాలు దాటినపుడు వెంటనే హెచ్చరికలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాద హెచ్చరికలు ఎవరెవరికి వెళ్లాలన్న దానిపై ఒక ఎస్‌ఓపీ తయారు చేయాలన్నారు. స్థానిక కలెక్టర్, ఎస్పీలు,సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు పంపేలా చూడాలని సూచించారు.

  • షాక్​ కొట్టాలి

కార్యకలాపాలపై క్షేత్రస్థాయిలో నిర్ణీత కాలంలో తనిఖీలు చేశాక జరిమానాలు విధించాలని ఆదేశించారు. పర్యావరణానికి జరిగిన హాని ప్రకారం జరిమానాలు విధించాలని..నిర్ణీత సమయంలోగా జరిమానాలు చెల్లించకపోతే భారీగా పెంచాలని ఆదేశించారు. జరిమానాలు షాక్‌ కొట్టేలా ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా చూడాలని నిర్దేశించారు. న్యాయనిపుణులను ఇన్వాల్వ్‌ చేస్తూ చట్టాన్ని సమర్థవంతంగా తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి: పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే

ABOUT THE AUTHOR

...view details