తక్కువ ధరకే విద్యుత్ అమ్మేవారితో ఒప్పందం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌పై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.... సౌర విద్యుత్ ప్లాంట్ విస్తరణకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. తక్కువ ధరకు విద్యుత్ విక్రయించే సౌర, పవన సంస్థలనూ ప్రోత్సహించాలని చెప్పారు. జెన్‌కో థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చూడాలని... బొగ్గు నాణ్యతపై ఎప్పటికప్పుడు థర్డ్ పార్టీతో తనిఖీ చేయించాలని అన్నారు. ఐదేళ్లలోగా విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించడం సహా... జెన్‌కోను లాభాల బాట పట్టించాలని జగన్ స్పష్టం చేశారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
తక్కువ ధరకే విద్యుత్ అమ్మేవారితో ఒప్పందం చేసుకోవాలి: సీఎం - cm review on electricity department news
రాష్ట్రంలో మరో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవంతంగా ప్లాంట్ ఏర్పాటు సహా త్వరగా విస్తరించడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
cm review on electricity department
TAGGED:
cm jagan review news