ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వైరస్‌ నిరోధంపై సీఎం జగన్​ సమీక్ష - కరోనా వైరస్‌ నిరోధంపై సీఎం సమీక్ష

కరోనా వైరస్‌ నిరోధంపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్​ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు.

CM REVIEW ON CORONA
కరోనా వైరస్‌ నిరోధంపై సీఎం సమీక్ష

By

Published : Mar 3, 2020, 2:43 PM IST

కరోనా వైరస్‌ నిరోధంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణలో కూడా ఒక కేసు నమోదైందని..రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదని సీఎం అన్నారు. ప్రజలను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

వైరస్‌ ఎలా వస్తుంది, వస్తే ఏం చేయాలన్న దానిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బాడీ, మౌత్‌ మాస్క్‌లను అందుబాటులో ఉంచుకోవాలని.. జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వైరస్‌ వ్యాప్తిచెందిన దేశాలనుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు.

ఇదీ చదవండి : కరోనా బాధితుడు 14 రోజుల్లో ఎంతమందిని కలిశాడు.. వారి పరిస్థితి ఏంటి?

ABOUT THE AUTHOR

...view details