ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిధులను జాగ్రత్తగా వినియోగించాలి: జగన్​ - jagan update news in tadepalli

జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించారు. వరద జలాలు వచ్చే 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నిండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. దీనిపై ప్రతిపాదనలతో పూర్తి నివేదిక ఇవ్వాలని... నిధుల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.

వరద నీరంతా ఎక్కడికెళ్లింది..ఏం చేస్తున్నారు

By

Published : Oct 28, 2019, 6:05 PM IST

గుంటూరు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అధికారులు సీఎంకు నివేదించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా, కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా... జగన్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న, తప్పకుండా కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి.... ఆ మేరకు అంచనాలను నివేదిక ద్వారా ఇవ్వాలని సూచించారు. నిధుల వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్న ముఖ్యమంత్రి.... ప్రాధాన్యతపరంగా ఖర్చు చేయాలని ఆదేశించారు. చేసిన ఖర్చుకు ఫలితాలు వచ్చేలా ఉండాలన్నారు.

భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా చాలావరకు జలయజ్ఞం పనులు పెండింగులో ఉంటున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న సీఎం... ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో ఉన్న రిజర్వాయర్ల నీటిమట్టాలు, ప్రస్తుత పరిస్థితిపై కూడా అధికారులు సీఎంకు వివరించారు.

భారీ వరద వచ్చినా కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నింపకపోవటంపై సీఎం ఆరా తీశారు. కాల్వల సామర్థ్యం, పెండింగ్​లో ఉన్న పనులపై అధికారుల నుంచి ముఖ్యమంత్రి పూర్తి సమాచారం కోరారు. వరద జలాలు వచ్చే 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నిండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. దీనిపై ప్రతిపాదనలతో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details