ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం సహాయనిధికి కొనసాగుతున్న విరాళాలు-రెడ్డీస్​ ల్యాబ్స్ రూ.5 కోట్ల విరాళం - ముఖ్యమంత్రి సహాయనిధికి కొనసాగుతున్న విరాళాలు

కరోనా వ్యాప్తి నివారణ, సహాయ చర్యల్లో భాగంగా సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. జీవీపీఆర్‌ సంస్థ ఛైర్మన్‌ వీరారెడ్డి రూ.కోటి విరాళం అందించగా.. ఆంధ్రా షుగర్స్‌ లిమిటెడ్‌, అనుబంధ సంస్థలు రూ.2.85 కోట్ల విరాళం ఇచ్చాయి. సీఎం సహాయనిధికి రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ.5కోట్ల విరాళం అందించారు.

cm-relief-funds-in-ap
cm-relief-funds-in-ap

By

Published : Apr 8, 2020, 8:46 PM IST

కోవిడ్‌-19 నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా జీవీపీఆర్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ సంస్థ కోటి రూపాయల విరాళం అందించి ఉదారత చాటుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన జీవీపీఆర్‌ సంస్థ ఛైర్మన్‌ జీఎస్పీ వీరారెడ్డి, ఎండీ శేఖర్‌రెడ్డి చెక్కును అందించారు. సీఎం సహాయనిధికి ఆంధ్రా షుగర్స్‌ లిమిటెడ్, అనుబంధ సంస్థలు 2.85 కోట్ల రూపాయలు విరాళమిచ్చాయి. ఆంధ్రా షుగర్స్‌ లిమిటెడ్ జేఎండీ అచ్యుతరామయ్య... సీఎంకు చెక్కు అందించారు. రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సీఎం సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రెడ్డీస్‌ల్యాబ్స్ ప్రతినిధి నారాయణరెడ్డి చెక్కు అందించారు.

ABOUT THE AUTHOR

...view details