కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని.. ప్రభుత్వ పరంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై చర్యలు తీసుకుంటున్నామని.. సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. రక్త నమూనాలు పుణెకు పంపకుండా మన రాష్ట్రంలోనే పరీక్ష చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అందరూ మాస్క్‌లు వేసుకోవాల్సిన అవసరం లేదని.. మన చేతులు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చేవారిని ముందుగానే గుర్తిస్తున్నామని తెలిపారు.
104కు ఫోన్ చేయండి
60 ఏళ్లకు పైబడిన వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతున్నట్లు తెలుస్తోందని.. ఇంతవరకు పదేళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం లేదని పీవీ రమేష్ పేర్కొన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, దగ్గు వస్తే 104కు ఫోన్‌చేస్తే ప్రభుత్వం తరఫున ప్రత్యేక అంబులెన్స్ వస్తుందని తెలిపారు. జ్వరం, దగ్గు వచ్చినవారు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. 6 గంటలకు ఒకసారి పారాసిటమిల్ వేసుకుంటే సరిపోతుందన్నారు.