భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసి.. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు బాటలు వేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని సీఎం జగన్ అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అంటూ కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. మహనీయుని చిత్రపటానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్ పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం - thadepalli camp office latest news
తెలుగుజాతి ఆత్మగౌరవానికి పొట్టి శ్రీరాములు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు.
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళి అర్పించిన సీఎం