ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

EDUCATION: '"మళ్లీ అమల్లోకి విదేశీ విద్య.. ఈ సారి ఆ పేరుతో".. - జగనన్న విదేశీ విద్యా దీవెన

EDUCATION: విదేశీ విద్య పథకాన్ని రాష్ట్రప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురానుంది. ఈ సారి ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పేరుతో దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. టాప్‌ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారందరికీ సంతృప్తకర స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని ప్రకటించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో పథకానికి అర్హత సాధించి విదేశాల్లో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు.

foreign education
foreign education

By

Published : Jul 12, 2022, 8:14 AM IST

EDUCATION: విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు విదేశీ విద్య పథకాన్ని రాష్ట్రప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురానుంది. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పేరుతో దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ప్రకటించింది. విదేశీ విద్య పథకాన్ని గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, ఇతర సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులకు అమలు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విజిలెన్స్‌ విచారణ పేరుతో దాన్ని నిలిపేసింది. పథకాన్ని అమలు చేయాలని గత మూడేళ్లుగా వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు పేర్కొంది. టాప్‌ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారందరికీ సంతృప్తకర స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని ప్రకటించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో పథకానికి అర్హత సాధించి విదేశాల్లో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు.

కుటుంబంలో ఒక్కరికే..

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. వాటి ప్రకారం..
* ఏపీలో స్థానికుడై 35 ఏళ్లలోపు వయసు కలిగి, ఏడాదికి రూ.8 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారు పథకానికి అర్హులు.
* కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తారు.
* ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికీ లబ్ధిని అందిస్తారు.
* పథకానికి అర్హుల గుర్తింపు కోసం ఏటా జనవరి- మే, సెప్టెంబర్‌- డిసెంబర్‌ల మధ్య నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
* క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.
* మొదటి 100 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సాధిస్తే పూర్తి బోధనా రుసుము చెల్లిస్తారు.
* 100 నుంచి 200 ర్యాంకుల్లోపు విశ్వవిద్యాలయాలకు ఎంపికయితే రూ.50 లక్షల వరకు అందిస్తారు.
* ఈ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ-94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లిస్తారు. మొదటి సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా, రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా, నాలుగో సెమిస్టర్‌/ ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా మొత్తాన్ని అందజేస్తారు.
* పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది/ సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యే వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details