రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. 1984 బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని వచ్చే నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆమె 2019 నవంబరు 13న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
'నీలం సాహ్ని పదవీకాలం పొడిగించండి' - కేంద్రానికి సీఎం లేఖ
సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగించమని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాశారు. వచ్చే నెల 30తో సాహ్ని పదవీకాలం ముగియనుంది.
!['నీలం సాహ్ని పదవీకాలం పొడిగించండి' cm letter to center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7188965-706-7188965-1589421791819.jpg)
కేంద్రానికి సీఎం లేఖ