యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. స్వామివారి దర్శనం అనంతరం ప్రధాన ఆలయంతోపాటు కొండపైన జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ - తెలంగాణ వార్తలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు.
![యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ kcr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10866116-456-10866116-1614845940480.jpg)
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
1200 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పునర్నిర్మాణాలను 2016 అక్టోబరు 11న ప్రారంభించగా... ఇప్పటివరకు సుమారు 850 కోట్లు వెచ్చించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అద్భుత గోపురాలు, ప్రభవించే ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులతో అలరారుతున్న ప్రధాన ఆలయం... 4.33 ఎకరాల్లో రూపుదిద్దుకుంటోంది.