ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెంగళూరుకు తెలంగాణ సీఎం కేసీఆర్... కాసేపట్లో మాజీ ప్రధానితో భేటీ - బెంగళూరుకు బయలుదేరిన సీఎం కేసీఆర్

KCR Bangalore Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. కాసేపట్లో మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సీఎం సమావేశంకానున్నారు.

KCR
KCR

By

Published : May 26, 2022, 1:21 PM IST

KCR Bangalore Tour: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... బెంగళూరుకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి టీసీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ సమావేశం కానున్నారు.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తారు. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్... అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తారు.

రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రాంతీయ పార్టీల పాత్ర, తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. తిరిగి సాయంత్రం 4 గం.కు బెంగళూరు నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 5 గం.కు హైదరాబాద్ చేరుకుంటారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details