ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 25 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు! - dharani portal in telangana

ధరణి పోర్టల్​ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్​ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. ఈ నెల 25 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.

cm-kcr
cm-kcr

By

Published : Nov 22, 2020, 5:07 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని వెల్లడించిన కేసీఆర్‌... న్యాయస్థానం స్టే విధించినందున 23న ప్రారంభం కావాల్సినవి తాత్కాలికంగా ఆగిపోయాయని వివరించారు. న్యాయస్థానంలో స్టే తొలగించగానే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు.

హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఈ నెల 23వ తేదీన న్యాయస్థానం విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదని సీఎం స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details