'ఇక అంతే సంగతి... కనిపిస్తే కాల్చివేత ఆదేశాలే తరువాయి' - కేసీఆర్
కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని తెలిపారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు.

cm-kcr-serious-comments-on-carona-effect
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
కరోనా నివారణ కోసం స్వతహాగా నియంత్రణ పాటించి ఎక్కడి వారు అక్కడే ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. ప్రజలు చెప్పినట్టు వినకపోతే 24 గంటలూ కర్ఫ్యూ విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రజల్లో మార్పు రాకపోతే ఆర్మీ రంగంలోకి దిగుతుందని చెప్పారు. పరిస్థితి చేయిదాటకముందే మేల్కొనాలని ఆ రాష్ట్ర ప్రజలకు సూచించారు.