ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యాదాద్రీశుడి బంగారు తాపడం కోసం కేసీఆర్ విరాళం.. ఎంత ఇచ్చారంటే..? - కేసీఆర్

Cm Kcr Yadadri Tour: యాదాద్రి పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీఎం దంపతులకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్‌.. స్వామివారికి బంగారు తాపడం కోసం విరాళం అందించారు.

Cm KCR Yadadri Tour
యాదాద్రిలో కేసీఆర్

By

Published : Sep 30, 2022, 4:49 PM IST

Cm KCR Yadadri Tour: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. కుటుంబసమేతంగా యాదాద్రికి వచ్చిన కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. బంగారు తాపడం కోసం విరాళం అందించారు. కిలో 16 తులాల బంగారాన్ని స్వామివారికి కానుకగా ఇచ్చారు. పూజల్లో కేసీఆర్‌ దంపతులతో పాటు మనువడు హిమాన్షు, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

అంతకుముందు రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక బస్సులో యాదాద్రికి చేరుకున్న కేసీఆర్‌.. బస్సులోనే కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రెసిడెన్షియల్ సూట్ చేరుకున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్స్‌లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సుమారు గంట పాటు అధికారులతో సీఎం సమావేశం కొనసాగింది.

ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, భక్తులు.. స్వామివారికి పసిడి సమర్పించారు. తానూ కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు అప్పుడు ప్రకటించిన సీఎం.. ఆ స్వర్ణాన్ని నేడు స్వామికి సమర్పించారు. దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో సీఎం యాదగిరిగుట్ట పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details