ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM KCR: ధాన్యం కొనుగోళ్ల అంశంపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం.. ఇవాళ మరోసారి సమీక్ష - telangana news

ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టి సారించారు. ఈ విషయంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, తెరాస లోక్​సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో సీఎం ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

CM KCR
CM KCR

By

Published : Dec 4, 2021, 10:29 AM IST

ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగా ఇవాళ మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి, తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో సీఎం ఈ మధ్యాహ్నం ప్రగతిభవన్​లో సమావేశం కానున్నారు.

ధాన్యం కొనుగోళ్ల విషయమై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెరాస ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయంపై స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వివరించారు. దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చదవండి:

TS CM KCR ON YASANGI: 'యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు'

ABOUT THE AUTHOR

...view details