కరోనా ప్రభావంతో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కోత విధించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విశేష కృషి చేస్తోన్న వైద్య ఆరోగ్య, పోలీసు ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. వారికి మార్చి నెల పూర్తి వేతనం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం కూడా అందించాలని స్పష్టం చేశారు. ప్రోత్సహకాన్ని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
వైద్య సిబ్బందికి అధిక ప్రాధాన్యత: