ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana Formation Day: అమరవీరుల స్థూపానికి తెలంగాణ సీఎం కేసీఆర్​ నివాళి - telangana formation updates

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్​లోని ప్రగతిభవన్‌లో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అంతకుముందు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్దకు సీఎం వెళ్లి నివాళులు అర్పించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.

KCR
తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన కేసీఆర్

By

Published : Jun 2, 2021, 11:21 AM IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. అమరవీరులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళి అర్పించారు. హైదరాబాద్​లోని గన్​పార్క్​ వద్ద అమరవీరుల స్థూపం వద్ద.. పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమప్రాధాన్యంతో.. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా దూసుకెళ్తోందని... రాష్ట్ర ఆవిర్భావదిన సందేశంలో సీఎం కేసీఆర్​ తెలిపారు. అన్ని వర్గాలకోసం అవసరమైన కార్యక్రమాలు, వినూత్న విధానాలతో చిరుప్రాయంలోనే ఘనవిజయాలతో తనదైన ముద్ర వేసిన తెలంగాణ... చాలా రంగాలు, అంశాల్లో దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు వెల్లడించారు. సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో ప్రభుత్వ చర్యలు గుణాత్మక మార్పుకు దోహదపడ్డాయని... అద్భుత ఫలితాలను ఇస్తున్నాయన్నారు. పారిశ్రామికరంగంలోనూ దూసుకెళ్తూ ఐటీలో అద్భుత పురోగతి సాధిస్తోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details