ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KCR: గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యం: సీఎం కేసీఆర్ - apts news

CM KCR Unveiling the statue of Gandhiji: కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి అందించిన సేవలు ప్రశంసనీయమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ధ్యానమూర్తిలో ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్‌వారిపై పోరాడి విజయం సాధించారని కొనియాడారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆవరణలో మహాత్ముడి విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు.

tg cm kcr speech at gandhi hospital
సీఎం కేసీఆర్

By

Published : Oct 2, 2022, 3:14 PM IST

CM KCR Unveiling the statue of Gandhiji: మహాత్మాగాంధీ ప్రవచించిన శాంతి-అహింసా సిద్ధాంతం, లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఉద్బోధించిన జై జవాన్‌-జై కిసాన్‌ నినాదం.. దేశంలో ప్రస్తుతం నలిగిపోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆవరణలో మహాత్ముడి విగ్రహాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో... ఈ 16 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాత్ముతుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గాంధీ ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను, కరోనా కాలంలో ధైర్యం పనిచేసిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్‌వారిపై పోరాడి విజయం సాధించారని కొనియాడారు. అంతకముందుకు సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు.

గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యం: సీఎం కేసీఆర్

'ధ్యానమూర్తిలో ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించడం గొప్ప విషయం. విగ్రహ ఏర్పాటుతో మంత్రి శ్రీనివాస్‌కు చిరస్థాయి కీర్తి దక్కుతుంది. కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి సేవలు ప్రశంసనీయం. గాంధీ వైద్య సిబ్బంది ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారు. మిగతా ఆస్పత్రుల్లో తిరస్కరించినా ఇక్కడికి తెచ్చి రోగుల ప్రాణాలు కాపాడారు. గాంధీ స్ఫూర్తితో పనిచేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నా. గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యం. గాంధీజీ విశ్వజనీన సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అహింస, శాంతి, ధర్మం, సేవ, త్యాగనిరతి సిద్ధాంతాలు విశ్వజనీనం.'-సీఎం కేసీఆర్

సమస్యలకు యుద్ధాలు పరిష్కారం కాదని చాటిచెప్పిన మహనీయుడు గాంధీ అని కేసీఆర్ కొనియాడారు. మానవాళికి గొప్ప సందేశం, మార్గాన్ని చూపించిన గొప్ప వ్యక్తి.. మార్టిన్ లూథర్ వంటి వారు గాంధీ మార్గాన్ని అభినందించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దలైలామా సైతం గాంధీ తనకు ఆదర్శం అని చెప్పారన్నారు. ప్రేమ, ఆప్యాయత ద్వారా అసహాయతను ఎదుర్కోవచ్చని చెప్పారు.. గాంధీజీని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మహాత్ముడిగా సంబోధించారన్నారు. అహింసతో స్వరాజ్యం సాదిద్ధామని గాంధీజీ ప్రతిపాదించారని తెలిపారు. అదే సమయంలో సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్థాపించారని కేసీఆర్ పేర్కొన్నారు. గాంధీ అహింస అన్నారు, మీరు మిలిటరీ స్థాపిస్తున్నారని బోస్‌ను విలేకరులు అడిగారన్నారు. అహింసా మార్గంలోనే స్వాతంత్ర్యం రావాలని కోరుకుంటున్నట్లు బోస్‌ చెప్పారు.. అహింసా మార్గంలో రాకపోతే సాయుధ పోరాటానికి సైన్యం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

'ప్రతి భారతీయుడిలో స్వాతంత్య్ర స్వేచ్ఛ, కాంక్ష రగిలించారు. భారత్‌ను కుల, మత, వర్గ రహితంగా స్వాతంత్య్రం వైపు నడిపారు. జాతి స్వాతంత్య్రం కోసం అందరూ పురోగమించాలని చాటిచెప్పారు. గాంధీజీ ప్రతి మాట, అడుగు ఆచరణాత్మకంగా ఉండేవి. ఆయన పోరాటం చూసి ఎందరో మహనీయులు స్ఫూర్తిని పొందారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా ఇవాళే. జై జవాన్, జై కిసాన్ నినాదం ఇచ్చారు శాస్త్రి. దేశంలో ఎం జరుగుతుందో అందరూ గమనించాలి. చెడును ఖండించాలి, మౌనం పనికి రాదు. జై జవాన్ అగ్నిపథ్‌లో నలిగి పోతున్నారు. కిసాన్ మాత్రం మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.'-సీఎం కేసీఆర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details