ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ రాజకీయాలపై గులాబీ బాస్​ గురి.. నేటి నుంచి దేశవ్యాప్త పర్యటనలు - జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టి

CM KCR National Tour: జాతీయ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి దృష్టిసారించారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన గులాబీ బాస్​ ఈ సారి జాతీయస్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతోనూ సమావేశం కానున్నారు..

CM KCR National Tour
జాతీయ రాజకీయాలపై గులాబీ బాస్​ గురి

By

Published : May 20, 2022, 8:34 AM IST

CM KCR National Tour: దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం దిల్లీ బయలుదేరి వెళ్లనున్న గులాబీదళపతి.. వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో భేటీ కానున్న ఆయన.. దేశ ఆర్ధిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదేవిధంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 22 మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్​ బయలుదేరి వెళ్లనున్న కేసీఆర్​... గతంలో ప్రకటించినట్లుగా జాతీయ రైతుఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, దిల్లీకి చెందిన సుమారు 600 రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి ఆర్థికంగా భరోసా అందించేందుకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున ఆర్ధిసాయం అందించనున్నారు. ఆ చెక్కుల పంపిణీలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌సింగ్‌లు పాల్గొంటారు.

ఈనెల 26న బెంగళూరు వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు. మరుసటిరోజు రాలేగావ్‌ సిద్ధి వెళ్లనున్న గులాబీదళపతి.. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీకానున్నారు. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోనున్నారు. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు. ఈ నెల 29 లేదా 30న బంగాల్‌, బిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను కేసీఆర్​ ఆదుకోనున్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన ఇలా..

  • మే 20వ తేదీన (నేడు) దిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో , జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతో సమావేశం
  • మే 22వ తేదీన మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్​కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్​లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
  • మే 26వ తేదీ ఉదయం బెంగళూరులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు.
  • మే 27వ తేదీన బెంగుళూరు నుంచి సీఎం కేసీఆర్ రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళతారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం సాయిబాబా దర్శనం కోసం సీఎం కెసిఆర్ షిర్డీ వెళతారు. అక్కడ నుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్​కు చేరుకుంటారు.
  • మే 29 లేదా 30వ తేదీన బంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details