ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానితో సీఎం కేసీఆర్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ! - సీఎం కేసీఆర్ దిల్లీ టూర్​ 202

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్..ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వంటి పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

cm-kcr-meet-pm-modi
cm-kcr-meet-pm-modi

By

Published : Dec 12, 2020, 10:43 PM IST

ప్రధానితో సీఎం కేసీఆర్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా దాదాపు అరగంట పాటు ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం అందించడం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, జీఎస్టీ బకాయిలకు సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా తక్షణ నిధులు మంజూరు చేసే విషయంపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌పురితో జరిగిన భేటీలో రాష్ట్రంలోని దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. నిన్న కేంద్ర మంత్రులు, అమిత్‌షా, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కేసీఆర్‌ సమావేశమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details