TRS May Offer MP Seat To Prakash Raj: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు పక్కా ప్లాన్ చేస్తున్న కేసీఆర్.. అందుకోసం జాతీయ స్థాయిలో యాక్టివ్ రోల్ ప్లే చేసేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో రాజకీయ, ఇతర అంశాలపై పట్టున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ముంబయి పర్యటన సందర్భంగా ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఈ పర్యటనలో సడన్ ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కీలక పదవి ఖాయమని తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ప్రకాశ్‌రాజ్‌కు కేసీఆర్ బంపర్ ఆఫర్
సినిమాలతో పాటు.. రాజకీయాల్లోనూ.. యాక్టివ్‌గా ఉండే ప్రకాశ్‌రాజ్‌కు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెరాస తరఫున ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం.
ప్రకాశ్‌రాజ్‌కు కీలక బాధ్యతలు!