తెలంగాణలో నీటిపారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ఆ శాఖను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరుల శాఖలో చీఫ్ ఇంజినీర్లు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పని చేస్తుందని కేసీఆర్ వెల్లడించారు.
జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై ప్రగతిభవన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు.. తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పులు వచ్చాయని, సాగునీటి వసతులు మెరుగయ్యాయని సీఎం అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, జలాశయాలు, పంపు హౌజ్‌లు, ఆయకట్టు పెరిగినందున పని భారం కూడా పెరిగిందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఉన్న 13 చీఫ్ ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాల సంఖ్యను 19కి పెంచాలని నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
జలవనరుల శాఖగా మాత్రమే..