ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr letter to pm modi) లేఖ రాశారు. 2021-22 ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని కోరిన సీఎం.. 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ నిబంధన పెంచాలని విజ్ఞప్తి చేశారు. 2021-22 ఖరీఫ్‌లో 90 శాతం ధాన్యం సేకరించాలని.. కొనుగోలుపై ఎఫ్‌సీఐకి తగిన ఆదేశాలివ్వాలని తన లేఖలో కోరారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధానంగా విన్నవించారు.
ఎంత కొంటారో చెప్పండి..
వచ్చే రబీలో తెలంగాణ నుంచి ఎంత కొంటారో తెలపాలని (cm kcr writes to pm modi) మోదీని కోరారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందని.. రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్పష్టత ఇవ్వట్లేదని ప్రధాని మోదీ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకువెళ్లారు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2021 ఖరీఫ్‌లో 55.75 లక్షల (cm kcr seeks clarity on paddy procurement) టన్నుల ధాన్యం దిగుబడి వస్తే.. కేవలం 32.66 లక్షల టన్నులే ఎఫ్‌సీఐ సేకరించిందని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. 2019-20 ఖరీఫ్‌తో పోలిస్తే 78 శాతం తక్కువగా సేకరణ జరిగిందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిని కలిసినా..
ధాన్యం సేకరణ లక్ష్యంపై సెప్టెంబర్‌లో కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పియూష్ గోయెల్‌ను కలిసినట్లు ప్రధాని చెప్పిన సీఎం కేసీఆర్.. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యం నిర్ధరించాలని విజ్ఞప్తి చేసినట్లు తన లేఖలో పేర్కొన్నారు. విజ్జప్తి చేసి 50 రోజులు దాటినా తమకు ఎటువంటి సమాచారం లేదని.. ఇప్పటివరకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలుపై సత్వరమే చర్యలు (cm kcr seeks clarity on paddy procurement) తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు.