గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పరామర్శించనున్నారు. సూర్యాపేటలోని విద్యానగర్లో నివాసముంటున్న కర్నల్ కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు.
ఇటీవల ప్రకటించినట్లు... సంతోష్ సతీమణికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగ నియామక పత్రం, ఇంటిస్థలం, 5 కోట్ల నగదు చెక్కును కేసీఆర్ అందించనున్నారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగిలిన 19 మంది సైనికుల కుటుంబాలకు పదేసి లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం ఇంతకుముందే ప్రకటించారు. ఆ మొత్తాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని తెలిపారు.