ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాధ్యతలో ఉన్నోళ్లు మాట్లాడకుంటే నడుస్తదా? - telangana cm kcr on central government

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపద సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న విధానాలను చూసి అనుసరించాలని సూచించారు.

telangana cm kcr fire on central government
దేశ బాధ్యతలో ఉన్నోళ్లు.. ఉల్కకుండ పల్కకుండ ఉంటే నడుస్తదా?

By

Published : May 6, 2020, 10:14 AM IST

తెలంగాణ రాష్ట్రానికి నెలకు రూ.15 వేల కోట్ల ఆదాయం రావాలి. కేంద్రం వాటా పోను నెలకు రూ.11 వేల కోట్లు రావాలి. వచ్చింది కేవలం 16 వందల కోట్లు మాత్రమే. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న విధానాలను చూసి అనుసరించాలి.

వలస కూలీలకు రైల్వే ఛార్జీలు ఇచ్చే డబ్బు కేంద్రం వద్ద లేదా? డబ్బులు వసూలు చేసేందుకు ఇదే సమయమా? కూలీలను తరలించే రైళ్లకు సూపర్‌ ఫాస్ట్‌ చార్జీలు, రిజర్వేషన్‌ ఛార్జీలు వేస్తారా? మొత్తం రూ.4 కోట్లు మేమే చెల్లించినం. రుణమాఫీ లాంటి పథకాలను ఎట్లా నడుపుతున్నం? అప్పు తెస్తాం.. దీన్ని బహిరంగంగానే చెబుతున్నా. దాంట్లో దాచేది ఏముంది?

కేంద్రం మన్ను కూడ ఇయ్యలే.. రూపాయి కూడా ఇయ్యలేదు. ఉల్టా ఆర్బీఐ రూ. 2000 కోట్లు కోత విధించింది. మా వినతులపై కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. దేశ బాధ్యతలో ఉన్నోళ్లు కదలకుండా మెదలకుండ..ఉల్కకుండ పల్కకుండ ఉంటే నడుస్తదా? ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని పెంచాలని ప్రధానిని కోరుతున్నా.

విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తాం. పార్లమెంటులో పాస్‌ కానివ్వం. కరెంటు ఛార్జీల నగదు బదిలీకి ఎట్టి పరిస్ధితుల్లో ఒప్పుకోం. కేంద్రం మౌనం కరెక్టు కాదు. ఒక లిమిట్‌ దాటాక కార్యక్రమం తీసుకుంటాం’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు.

ఇవీ చూడండి: వ్యాక్సిన్ తయారీ​ అంత ఈజీ కాదు...!

ABOUT THE AUTHOR

...view details