TS cm kcr on modi: ధాన్యం కొనమని వెళితే 'మీకేం పనిలేదా.. మళ్లీ వచ్చారని' కేంద్రమంత్రి అన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో 60 లక్షల ఎకరాలు సాగుకావటం లేదని మాట్లాడారని అన్నారు. రైతులు పండించిన తర్వాత కేంద్రం కొనకుంటే పరిస్థితి ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. కల్తీ విత్తనాల(fake seeds) మీద పీడీయాక్టు(pd act) తెచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని.. భాజపా పాలిత రాష్ట్రాల కంటే కోటి రెట్లు మెరుగ్గా తెలంగామ ఉందని స్పష్టం చేశారు. కేంద్రాన్ని ఒప్పించే ధైర్యం లేని కిషన్‌రెడ్డి(kishan reddy) ఇక్కడ అసత్యాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రపంచ ఆకలిసూచీలో(hunger index) భారత్ 101వ స్థానంలో ఉందని... పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే హీన స్థితిలో ఉన్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు ఆహారం లేక చస్తుంటే.. నిల్వలు అధికంగా ఉన్నాయని అంటున్నారని... నిల్వలు ఎక్కువుంటే దేశ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు భాజపా(bjp govt) హయాంలో ఆకలిచావులు పెరిగాయని సర్వేలు చెప్తున్నాయని... పేర్కొన్నారు.