ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముందుకురండి.. ప్రజలను ఆదుకోండి: తెలంగాణ సీఎం కేసీఆర్​ - cm kcr latest news

భారీవర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చాటాలని కోరారు. సీఎం సహాయనిధికి విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

cm kcr appeal to all for support
ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలి: సీఎం కేసీఆర్​

By

Published : Oct 19, 2020, 5:38 PM IST

భారీవర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చాటాలని కోరారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి తమిళనాడు ప్రభుత్వం రూ.పది కోట్ల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సీఏం కేసీఆర్​కు లేఖ రాశారు.

భారీవర్షాలు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో నష్టాన్ని మిగిల్చాయన్న పళనిస్వామి... విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వ తక్షణ చర్యలు తీసుకొందని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన... తమిళనాడు రాష్ట్రం తరపున రూ.పది కోట్ల ఆర్థికసాయంతో పాటు పెద్దసంఖ్యలో దుప్పట్లు, చద్దర్లు పంపుతున్నట్లు ప్రకటించారు.

ఇంకా అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం, ప్రజలు, సీఎం పళనిస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉదారంగా ముందుకు వచ్చినందకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రి విజ్ఞప్తికి స్పందించిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ.. సీఎం సహాయనిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించింది. ప్రభుత్వ సహాయక చర్యలకు తోడ్పాటు కోసం సాయమందిస్తున్నట్లు మెయిల్‌ సంస్థ తెలిపింది.

ఇవీ చూడండి:

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

ABOUT THE AUTHOR

...view details