ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ, ఏఎంఆర్డీయే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు - Jagan Review news

విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వీటి పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

విశాఖ జిల్లాలోని కీలక ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష
విశాఖ జిల్లాలోని కీలక ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష

By

Published : Feb 8, 2021, 4:49 PM IST

విశాఖపట్నంలోని సముద్రతీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్షించారు. ఇదే భూమిని లులూ గ్రూపునకు కారుచౌకగా 33 ఏళ్ల లీజ్‌కు గత ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై సీఎం జగన్ సమీక్ష చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ, ఏపీఐఐసీ ప్రతినిధులు సీఎంకు వివరాలు అందించారు. కమర్షియల్‌ ప్లాజా, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.1450 కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్‌బీసీసీ వివరించింది.

అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్టులపైనా సీఎం జగన్ సమీక్ష జరిపారు. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనపై అధికారులు వివరాలు అందించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందన్న సీఎం... రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని సైతం అభివృద్ధి చేయాలని సూచించారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మెయిన్‌ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు పూర్తి చేయాలని... హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details