ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రత్యేక హోదా కోరుతూ ప్రధానికి సీఎం జగన్ లేఖ - మోదీకి జగన్ లేఖ వార్తలు

15వ ఆర్థిక సంఘం నివేదికలోని అంశాలను గుర్తుచేస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. విభజనతో ఆర్థికలోటులో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

cm jagan wrote a letter to pm modi for specail status
సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ

By

Published : Feb 5, 2020, 6:08 AM IST

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రధానికి సీఎం లేఖ

పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోని అంశం కాదని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంటూ 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని, తెలంగాణకే ఎక్కువగా ఆదాయం వెళ్లిందని, అందువల్ల తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని సీఎం జగన్ లేఖలో కోరారు. కేంద్ర బడ్జెట్‌ ఆశాజనంగా ఉన్నా, రాష్ట్రానికి తగిన కేటాయింపులు లేక రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం చేసిన సూచనలకు, 15వ ఆర్థిక సంఘం నివేదికకు మధ్య వైరుధ్యం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నివేదికలోని అంశాలను పరిశీలించి, ప్రత్యేక హోదాని ప్రకటించి, ఏపీని ఆదుకోవాలని లేఖలో ప్రధానిని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :'ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు'

ABOUT THE AUTHOR

...view details