ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు ప్రజలకు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు - ugadi news

తెలుగువారందరికీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం దృష్ట్యా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని కోరారు. సామూహిక వేడుకలు వద్దని సూచించారు.

Cm jagan wishes on Ugadi fest
తెలుగు ప్రజలకు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు

By

Published : Mar 24, 2020, 11:28 PM IST

తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించిన సీఎం జగన్‌... రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ కళకళలాడాలని ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాది ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలిగించాలన్నారు. కరోనా దృష్ట్యా సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని ఉద్ఘాటించారు. కొన్నాళ్లపాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details