రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో నేడు గోపూజ మహోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కామధేను పూజ జరిపిస్తున్నారు. ఇస్కాన్ సహకారంతో 108 గోవులకు పూజ నిర్వహించనున్నారు. తితిదే ఆధ్వర్యంలో గంటపాటు కామధేను పూజ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా గోపూజ మహోత్సం- నరసారావుపేటలో పాల్గొననున్న సీఎం
రాష్ట్రవ్యాప్తంగా గోపూజ మహోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. గుంటూరు జిల్లా నరసారావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగే పూజలో సీఎం జగన్ పాల్గొంటారు.
గోపూజ మహోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్
గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగే గోపూజలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. 11:25 గంటలకు స్టేడియంకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:10 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
ఇదీ చదవండి:పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ను ఏపీతో పంచుకోండి: తెలంగాణకు నిపుణుల కమిటీ సూచన
Last Updated : Jan 15, 2021, 7:17 AM IST