CM JAGAN : ప్రధాని నరేంద్రమోదీతో సీఎం జగన్ సోమవారం ఉదయం 10.30 గంటలకు దిల్లీలో భేటీ కానున్నారు. ఆదివారం రాత్రి దిల్లీ చేరుకున్న ఆయన.. 1-జన్‌పథ్‌లో బస చేశారు. సోమవారం ఉదయం ప్రధానిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. పోలవరం అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు పెండింగు బిల్లులు మంజూరు చేయాలని కోరడంతో పాటు, నిర్వాసితులకు పునరావాస కల్పనపై ప్రధానితో సీఎం చర్చించనున్నట్లు వెల్లడించాయి. రాష్ట్రంలో ఇళ్లు నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర సాయాన్ని సీఎం కోరనున్నారని చెప్పాయి.
నేడు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ, పోలవరంపై చర్చించే అవకాశం - ఏపీ తాజా వార్తలు
CM JAGAN ముఖ్యమంత్రి జగన్ దిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధాని మోదీతో ఈరోజు ఉదయం చర్చించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్, సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ములను కలవనున్నట్లు సమాచారం..
నూతన వైద్య కళాశాలలకు అనుమతులతో పాటు, కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు విభజన చట్టంలోని హామీలపైనా మరోసారి విజ్ఞప్తి చేస్తారని వెల్లడించాయి. నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లను కూడా ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం కలిసే అవకాశం ఉందని వెల్లడించాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్, సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ములను కలవనున్నట్లు సమాచారం..
ఇవీ చదవండి: