ముఖ్యమంత్రి జగన్... పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. 10 గంటల 20 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని హెలికాప్టర్ ద్వారా విహంగవీక్షణం నిర్వహించారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్పిల్ వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. స్పిల్ వే నిర్మాణం పనులు జరుగుతున్న తీరును ఇంజనీర్లు సీఎంకు వివరించారు. అనంతరం కాపర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరం వద్ద సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం పనుల ప్రగతిపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు.
పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్ - పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం జగన్ న్యూస్
పోలవరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. విహంగవీక్షణం ద్వారా పోలవరం నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఇంజినీర్లు, అధికారులు, గుత్తేదారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
![పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్ cm jagan in polavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9871010-454-9871010-1607929331146.jpg)
cm jagan in polavaram
Last Updated : Dec 14, 2020, 1:35 PM IST
TAGGED:
cm jagan in polavaram