ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రపంచంతో పోటీపడేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం: సీఎం - ఏపీలో పథకాల వివరాలు

జగనన్న విద్యాకానుక పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా పునాదిపాడులోని.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని సీఎం అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకే ఉందన్న జగన్.. ప్రపంచంతో పోటీపడే పరిస్థితి మన పిల్లల్లో రావాలని తెలిపారు.

cm jagan
cm jagan

By

Published : Oct 8, 2020, 1:47 PM IST

ప్రపంచంతో పోటీపడేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం: సీఎం

విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మనబడి, నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్న సీఎం.. నవంబర్‌ 2న పాఠశాలలు ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారినప్పుడే పిల్లల పరిస్థితి మారుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విద్యా వ్యవస్థను సములంగా మార్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రతి పేదవాడికి ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశామన్నారు. పేద పిల్లలు గర్వంగా తలెత్తుకుని పాఠశాలలకు వెళ్లాలని అన్నారు. చదువుతోనే పేదరికం నుంచి కుటుంబాలు బయటపడతాయన్న జగన్.. పేదల తలరాత మార్చేందుకు విద్యాశాఖలో 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.

ఇదీ చదవండి:'జగనన్న విద్యా కానుక' పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details