ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్​ - cm jagan on spandana

రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీని ఆగస్టు 15న కచ్చితంగా చేపడతామని సీఎం జగన్​ స్పష్టం చేశారు. తెదేపా నాయకులు కోర్టులకు వెళ్లడం వల్ల సుప్రీం కోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చిందని.. సర్వోన్నత న్యాయస్థానంలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాయిదా నేపథ్యంలో మరింత మెరుగ్గా ప్రక్రియ చేపట్టాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.

ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్​
ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్​

By

Published : Jul 7, 2020, 2:52 PM IST

రాష్ట్రంలో ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామని సీఎం జగన్​ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఆయన‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ ‌హాజరయ్యారు. ఎంతో మంది పేదలకు, వాళ్ల జీవితాలకు ఎంతో పెద్ద ఆధారం వచ్చేదని చాలా ఆశపడ్డామన్నారు.

దురదృష్టవశాత్తూ కొంతమంది తెలుగుదేశం నాయకులు న్యాయస్థానానికి వెళ్లిన కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడిందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదని సీఎం అన్నారు. సుప్రీంకోర్టులో సానుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకంతో ఉన్నామని అన్నారు. వాయిదా నేపథ్యంలో మరింత మెరుగ్గా చేయడానికి కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details