రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని .. ఆ ప్రాంతాలపై దృష్టి సారించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు జనసాంద్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఈ వ్యాప్తి ఎక్కువగా ఉందని సీఎం స్పష్టం చేశారు. రెండంచెలుగా ఈ వ్యాప్తికి సంబంధింన అంశాలను పర్యవేక్షించనున్నట్టు సీఎం వెల్లడించారు.
పరిస్థితులు అదుపులో ఉండాలి
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు, లాక్ డౌన్ పరిస్థితులను కఠినంగా అమలు చేయాల్సిన అవసరముందని తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో గట్టి చర్యలే చేపట్టామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలంతా వ్యాప్తి నిరోధకం కోసం ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌ను పాటించకపోతే లక్ష్యం నెరవేరదని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉండాలని.. కలెక్టర్లతోపాటు మున్సిపల్ కమిషనర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. మొదటి దశ టీంలో వార్డు వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల ప్రైమరీ రిసోర్స్ పర్సన్లు, వార్డు సచివాలయంలో ఉండే హెల్త్ సెక్రటరీ, అదనపు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఉంటారని.. విదేశాలనుంచి వచ్చిన వారు ఉన్నా, లేకున్నా.. ప్రతి ఇంటిమీదా వీరు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
ప్రతి జిల్లాలో 5వేల పడక కేంద్రాలు