స్పందనపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పారదర్శక పద్ధతిలో పథకాలు అందిస్తున్నామని.. పేదలకు 30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పింఛన్ కార్డు ఇస్తామన్నారు. 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ, 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలిస్తామన్నారు. దరఖాస్తు చేసినవారు అర్హులని తేలితే తప్పనిసరిగా పథకాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. పథకాల వర్తింపుపై సంయుక్త కలెక్టర్లు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అర్హత ఉన్నవారికి వాలంటీర్ తప్పక పథకం వర్తింపజేయాలని.. అర్హత ఉన్నా ఇవ్వకపోతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇవ్వకపోతే పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.
'అర్హత ఉన్నవారికి పథకాలివ్వకపోతే..పరిహారమివ్వాల్సిందే' - కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ న్యూస్
అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత నిర్దిష్ట సమయంలోనే కార్డులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.
cm jagan video conference with collectors on welfare scheemes